ఎల్బీనగర్:
అసలే భగ్గుమంటున్న ఎండా కాలం ఈ కాలంలో దాహార్తి తీర్చాల్సిన జలమండలి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన తాగే నీరు వృధాగా రోడ్ల పాలవుతున్నాయి.మంచినీళ్ల లీకేజ్ కు మరమ్మత్తులు చేసి కూడా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో చేసిన పనికిమాలిన పనికి మళ్లీ మంచినీరు అంతా లీకై మన్సురాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్ రోడ్ లోని జడ్జిస్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో నుండి కాలనీ మొత్తం వరదలై పారుతున్న తాగునీరు.పట్టించుకోని జలమండలి అధికారుల నిర్లక్ష్యంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు.


