కాప్రా, భారతశక్తి: కాప్రా ప్రాంతంలోని చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో 14 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుమారు 600 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయబడింది. కార్యక్రమం మొత్తం భక్తి భావంతో, సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరిగింది.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో సోలిస్ కంటి ఆసుపత్రి చైర్మన్ నందనంపాటి రామాంజనేయులు ఆలయంలో జరిగే కార్యక్రమాల కోసం వంట సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శివమణి స్వర్ణరాజ్, మాజీ కార్పొరేటర్ కొత్త రామా రావు, జె. కృష్ణమాచార్యులు, ఈ.ఓ., కమిటీ సభ్యులు పొట్టు బాబురావు, పడమటి మల్లారెడ్డి, ఉప్పల వినోద్ కుమార్, ఓర్ల శ్రీధర్ రెడ్డి, గూడ సత్యనారాయణ, పబ్బారి నరేందర్ గౌడ్, దేవాలయ జూనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాస్, శంకర్ బాబు, గజేందర్ రెడ్డి, ముకేష్, మోహన్, విశ్వం, విజయెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21.04.2026 సుదర్శన హోమం, చక్ర స్నానం మరియు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయని తెలియజేశారు.


