మూడు కూరగాయల మార్కెట్లలో మారి – సోర్ట్ & ఎంఎంసీ మార్కెట్ శుభ్రత డ్రైవ్
ఎల్బీనగర్:
స్వర్ణలతా మదర్సన్ ట్రస్ట్ (SLMTT) మద్దతుతో, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) సహకారంతో అమలవుతున్న MARI-SORT (సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఫర్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ హోల్‌సేల్ మార్కెట్, ఎన్టీఆర్ రిటైల్ మార్కెట్, కొత్తపేట రైతు బజార్లలో “వెజిటబుల్ మార్కెట్ క్లీన్-అప్ డ్రైవ్ మరియు అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.జాతీయ స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారం చివరి రోజైన అక్టోబర్ 2న జరిగిన ఈ డ్రైవ్, కూరగాయల మార్కెట్లో రోజువారీ వ్యర్థాలు పేరుకుపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టింది. “మార్కెట్ శుభ్రత డ్రైవ్, స్వచ్ఛత మన బాధ్యత” నినాదంతో పారిశుద్ధ్య కార్మికులు మార్కెట్ ప్రాంగణాలను శుభ్రం చేయగా, క్షేత్రస్థాయి బృందం వ్యాపారులు, వినియోగదారులు, ఆటో డ్రైవర్లతో నేరుగా మాట్లాడి తెలుగు అవగాహన కరపత్రాలను పంపిణీ చేసింది.ఈ ప్రచారం నాలుగు ముఖ్య సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.చెత్తను మూలం వద్దే వేరు చేయండి. తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరు డబ్బాల్లో వేయండి.ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ను మానేసి, మళ్లీ మళ్లీ వాడగలిగే సంచులు, డబ్బాలను ఉపయోగించండి.తడి చెత్తను డంపింగ్ యార్డులకు పంపకుండా ఇంట్లోనే కంపోస్ట్‌గా మార్చండి.మార్కెట్ ప్రాంగణాన్ని, దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.సేంద్రీయ వ్యర్థాల నిర్వహణకు ఆచరణాత్మక పరిష్కారంగా ఏరోబిన్ సాంకేతికతతో కంపోస్టింగ్ విధానాన్ని కూడా ప్రాజెక్ట్ పరిచయం చేసింది.ప్రచార బ్యానర్లతో కూడిన ఆటో రిక్షా మార్కెట్ల పరిసరాల్లో తిరుగుతూ ఈ సందేశాన్ని మార్కెట్ వెలుపలికీ తీసుకెళ్లింది.మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఘన వ్యర్థాల నిర్వహణ) శ్రీమతి సిహెచ్. చందన, మారి – సోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పూర్ణ చంద్రిక వారి బృంద సభ్యులు శ్రీకాంత్, యాకన్న, కొత్తపేట కూరగాయల మార్కెట్ యార్డ్ ప్రతినిధి నరహరి, ఎస్ఎస్ఏ బుచ్చయ్య ఇతర ఎంఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.


