హైదరాబాద్:
గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆయనకు ఘన నివాళులర్పించారు.
‘శ్రీరామచరితమానస్’ వంటి మహోన్నత రచన ద్వారా భక్తి భావనకు, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని తెలిపిన గొప్ప కవి గోస్వామి తులసీదాస్ అని గవర్నర్ పేర్కొన్నారు.
తులసీదాస్ రచనలు కాలాతీతమైనవని, తరతరాలుగా ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యంపై అవి చెరగని ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు. ఆయన సాహిత్యం భక్తి, ధర్మం, భారతీయ సంస్కృతిపై ప్రజల్లో అవగాహనను మరింతగా పెంపొందించిందన్నారు.
గోస్వామి తులసీదాస్ బోధనలు, రచనలు భవిష్యత్ తరాలకు సైతం స్ఫూర్తినిస్తూ, ప్రజలను శ్రీరాముని ఆదర్శాలు, ధర్మమార్గం వైపు నడిపించాలని గవర్నర్ ఆకాంక్షించారు.


