Saturday, November 7, 2026
Google search engine
Homeతెలంగాణదిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ నూతన షోరూమ్ వైభవంగా శుభారంభం

దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ నూతన షోరూమ్ వైభవంగా శుభారంభం

రంగారెడ్డి

దిల్సుఖ్నగర్ వేగా జ్యువెలర్స్ నూతన షో రూమ్ ప్రారంభోత్సవం ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆభరణాల ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఆభరణాల సంస్థగా పేరొందిన వేగా జ్యువెలర్స్ తమ నూతన షోరూమ్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించారు. వేగా జ్యువెలర్స్ ప్రచారకర్త, సంస్థకు అత్యంత ఆత్మీయులు నందమూరి బాలకృష్ణ (బాలయ్య బాబు) శుభాశీస్సులతో నూతన షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి ప్రగ్యా జైస్వాల్ ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌ను సందర్శించి తిరుగుతూ ఖాతాదారులతో కలిసి ఆమె సందడి చేశారు.

నూతన షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇది తమ 7వ షోరూమ్ అని, హైదరాబాద్ నగరంలో రెండవదని, తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టామని తెలియజేశారు.

ప్రారంభోత్సవ శుభ సందర్భంగా బంగారు ఆభరణాలు వేస్టేజ్ 2.99% నుంచి 11.99% వరకు ఉంటుందని మరియు తయారీ (మేకింగ్) చార్జీలు ఉండవని తెలిపారు. వజ్రాల ఆభరణాల క్యారెట్ ధర రూ. 47,999/- ఉంటుందని, ఈ ప్రత్యేక ఆకర్షణీయమైన ఆఫర్లు 6 నవంబర్ నుంచి 30 నవంబర్ 2026 వరకు మాత్రమే ఉంటాయని చెప్పారు. నూతన షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన మెగా గోల్డ్ లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, మొత్తం 100 మంది విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల 24 క్యారెట్ బంగారం చొప్పున మొత్తం 500 గ్రాముల బంగారం విజేతలకు అందిస్తున్నామని వారు వివరించారు.

ఈ నూతన షోరూమ్‌లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో కూడిన బంగారు, వజ్రాభరణాలు, సంప్రదాయ మరియు ఆధునిక నగల కలెక్షన్లు అందుబాటులో ఉంచామని, బంగారు, వజ్రాభరణాల కొనుగోలుపై ప్రత్యేక ప్రయోజనాలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఇతర ప్రత్యేక ఆఫర్లు తెలుసుకొని, అందరు ఈ సువర్ణ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు తగిన విభిన్నమైన ఆభరణాల కలెక్షన్లతో వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు, ఆభరణాల ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేగా జ్యువెలర్స్ నూతన షోరూమ్‌ను సందర్శించి, రాబోయే వివాహ సీజన్ కొరకు సందర్శించి ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లను పొందాలని సంస్థ ఆహ్వానిస్తోంది. రాబోయే వివాహ సీజన్ కొరకు ప్రత్యేకమైన డిజైన్లలో అపురూపమైన బ్రైడల్ కలెక్షన్స్ ఈ ఆఫర్ కాలంలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments