Wednesday, September 23, 2026
Google search engine
Homeతెలంగాణన‌గ‌రంలో వ‌ర్షం.. హైడ్రా అప్ర‌మ‌త్తం

న‌గ‌రంలో వ‌ర్షం.. హైడ్రా అప్ర‌మ‌త్తం

క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

ఎక్క‌డా వ‌ర‌ద నిల‌వ‌కుండా హైడ్రా చ‌ర్య‌లు

హైద‌రాబాద్‌

వానొస్తే వ‌ర‌ద ముంచెత్తే ప‌రిస్థితుల నుంచి న‌గ‌రం చాలావ‌ర‌కు బ‌య‌ట ప‌డింది. హైడ్రా అప్ర‌మ‌త్త‌త‌తో ర‌హ‌దారులు, లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగే ప‌రిస్థితులు త‌గ్గాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం కార్యాల‌యాలు వ‌దిలే స‌మ‌యంలో 3.3 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డినా ఎక్కడా వ‌ర‌ద నీరు నిల‌వ‌లేదు. వ‌ర‌ద కాలువ‌లు, క్యాచ్‌పిట్లు, క‌ల్వ‌ర్టుల్లో పూడిక‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిస్తూ.. ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయ‌డంతో మంగ‌ళ‌వారం ఖైర‌తాబాద్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్, నారాయ‌ణ‌గూడ‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, క‌వాడిగూడ‌, జీడిమెట్ల‌, మూసాపేట‌, కూక‌ట్‌ప‌ల్లి, మూసారంబాగ్‌, గాజుల రామారం ప్రాంతాల్లో భారీ వ‌ర్షం ప‌డినా ఎక్క‌డా నీరు నిల‌వ‌లేదు. హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి ప‌రిశీలించారు. సికింద్రాబాద్ క్లాక్ ట‌వ‌ర్ వంతెన కింద నిలిచిన‌ నీటిని మోటార్ల‌తో తొల‌గించే ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల పాప‌య్య‌గారితో పాటు డీఎఫ్‌వోలు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. హైడ్రా ఎస్ ఎఫ్ వోలు, డీఆర్ ఎఫ్ సిబ్బంది, మెట్ టీమ్‌లు ముందుగానే అప్ర‌మ‌త్త‌మై.. వ‌ర‌ద ముంచెత్తే ప్రాంతాల్లో చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో ఎక్క‌డా ఇబ్బందులు త‌లెత్త‌లేదు. సికింద్రాబాద్ క్లాక్‌ట‌వ‌ర్ ఆర్‌యూబీ వంతెన కింద లోత‌ట్టు ప్రాంతం కావ‌డం.. వ‌ర‌ద కాలువ‌లు స‌రిగా లేక‌పోవ‌డంతో ఒక అడుగు నీరు నిలిచినా 25 హెచ్‌పీ మోటార్ల సాయంతో తొల‌గించ‌డంతో రాక‌పోక‌ల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌లేదు. సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కూ 9 చోట్ల చెట్లు ప‌డిపోయిన ఫిర్యాదులు హైడ్రా కంట్రోల్ రూమ్‌కు వ‌చ్చాయి. అలాగే 4 చోట్ల నీరు నిలిచిన‌ట్టు ఫిర్దులంద‌గా.. వీటిని హైడ్రా క్లియ‌ర్ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments