Friday, October 9, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్బిగ్‌ బాస్కెట్ రైడర్ల పేఅవుట్ పెంచాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

బిగ్‌ బాస్కెట్ రైడర్ల పేఅవుట్ పెంచాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

గడ్డిఆన్నారం డివిజన్ పరిధిలోని గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద గురువారం బిగ్ బాస్కెట్ రైడర్లు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిగ్ బాస్కెట్ రైడర్లు పలు సమస్యలు సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వారు ముఖ్యంగా బిగ్‌బాస్కెట్ రైడర్ల పేఅవుట్‌ను పాత విధానంలో కొనసాగించాలని, బిగ్‌ బాస్కెట్‌లో పనిచేస్తున్న డెలివరీ రైడర్లు ప్రతిరోజూ సుమారు 14 నుంచి 16 గంటల వరకు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ,వారి శ్రమకు తగిన పారితోషికం అందడం లేదని రైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కో ఆర్డర్‌కు రూ.25 వరకు పేఅవుట్ చెల్లించేవారని, ప్రస్తుతం దానిని రూ.15కు తగ్గించారని వారు తెలిపారు. పేఅవుట్‌ను తిరిగి పెంచాలని రైడర్లు కోరినప్పటికీ, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా సుమారు 50 మంది రైడర్ల ఐడీలను బ్లాక్ చేసినట్లు వారు పేర్కొన్నారు.డెలివరీ రైడర్లు ప్రతిరోజూ ఎండ, వర్షం, ట్రాఫిక్‌ను ఎదుర్కొంటూ గంటల తరబడి పనిచేస్తున్న నేపథ్యంలో వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని పేఅవుట్‌ను తగ్గించకుండా గతంలో అమలు చేసిన విధంగానే ఒక్కో ఆర్డర్‌కు కనీస బేస్ పేఅవుట్‌ను రూ.25గా కొనసాగించాలని కోరారు. అలాగే బ్లాక్ చేసిన రైడర్ల ఐడీలను వెంటనే పునరుద్ధరించి వారి సమస్యలను సంస్థ యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం సుధీర్ రెడ్డి స్టోర్ ఇంచార్జి పాషాని పిలిపించి రైడర్ల సమస్యలు పరిష్కారం చేయాలనీ తెలిపారు.స్టోర్ ఇంచార్జి మాట్లాడుతూ, ఈ సమస్యలను పైస్థాయి వారి దృష్టికి తీసుకొనివెళ్తామని అన్నారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రైడర్ల సమస్యలపై పైస్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్,డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, సొంటి చంద్రశేఖర్ రెడ్డి, గండి సన్నీ యాదవ్, రమణారెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments