*అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
*మహేశ్వరం
మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని మంఖాల్ డివిజన్లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగిన ఈ పవిత్ర వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
*ఘన స్వాగతం – ప్రత్యేక పూజలు
ఈ వేడుకలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*ప్రజల సుఖసంతోషాలే ధ్యేయం: పారిజాత నర్సింహారెడ్డి
ఈ సందర్భంగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సనాతన సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలసి పండుగలు జరుపుకోవడం మన సాంస్కృతిక విశిష్టత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు,సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.



