Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణమరణంలోనూ జీవదాతగా నిలిచిన ఉపాధ్యాయురాలు

మరణంలోనూ జీవదాతగా నిలిచిన ఉపాధ్యాయురాలు

అవయవ దానంతో 8 మందికి పునర్జన్మ

ఎల్బీనగర్

తాను చనిపోతూ ఎనిమిది మందికి ప్రాణదానం చేసి ఓ ప్రభుత్వం ఉపాధ్యాయురాలు సమాజానికి ఆదర్శంగా నిలిచారు.నల్గొండ కు చెందిన ఉపాధ్యాయురాలు వనస్థలిపురంలో నివాసం ఉండే గొర్రె నీరజ సోమవారం ఉదయం బ్రెయిన్ డెడ్ కు గురి కాగా, వైద్యుల నిర్ధారణ అనంతరం, విషయం తెలుసుకున్న అఖిల భారత శరీర మరియు అవయవ దాతల సంఘం జాతీయ కన్వినర్ ఎల్.వి.కుమార్ బాధిత కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ క్లిష్ట సమయంలో అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను, మరొకరికి ప్రాణం పోయడం ద్వారా సమాజంలో ఎలా జీవించి ఉంటారో వారికి వివరించారు. ఎల్.వి. కుమార్ విజ్ఞప్తికి స్పందించిన కుటుంబ సభ్యులు, పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకు వచ్చారు.
కుటుంబసభ్యుల అంగీకారంతో మంగళవారం మలక్ పేట్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆమె శరీరం నుండి కీలక అవయవాలను సేకరించి, అత్యవసరంగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది మంది రోగులకు విజయవంతంగా అమర్చారు. తద్వారా ఆ ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
ఈ సందర్భంగా ఎల్.వి. కుమార్ మాట్లాడుతూ, కన్నబిడ్డను, తోడబుట్టిన వారిని కోల్పోయిన బాధలోనూ సమాజం కోసం ఆలోచించి, అవయవ దానానికి అంగీకరించిన గొర్రె నీరజ కుటుంబసభ్యుల నిర్ణయం అత్యంత అభినందనీయమన్నారు. మూఢనమ్మకాలను పక్కన బెట్టి, ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలని, మరణానంతరం మరొకరికి జీవం పోయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదర్శంగా నిలిచిన నీరజ కుటుంబానికి పలువురు ప్రముఖులు, అవయవ దానం పొందిన వారు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత శరీర మరియు అవయవ దాతల సంఘం కోఆర్డినేటర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు అనిరుద్రారెడ్డి, అంజయ్య, కేజియా, నాగేందర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments