Tuesday, November 17, 2026
Google search engine
Homeతెలంగాణమహేశ్వరం నియోజకవర్గ స్థాయిలో క్విజ్, వ్యాసరచన పోటీలు

మహేశ్వరం నియోజకవర్గ స్థాయిలో క్విజ్, వ్యాసరచన పోటీలు

కందుకూరు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ఓటర్ల జాబితా ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు మహేశ్వరం నియోజకవర్గ స్థాయిలో క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించినట్లు ఎన్నికల నమోదు అధికారి, కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్. జగదీశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోటీలు సోమవారం జిల్లెలగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు వెల్లడించారు.8వ తరగతి నుంచి ఆపై తరగతులు చదువుతున్న పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

క్విజ్ పోటీ అంశాలు:

భారత ఎన్నికల సంఘం
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

వ్యాసరచన పోటీ అంశాలు:

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రాధాన్యత ఓటు విలువ, ప్రాధాన్యత.ఈ పోటీలను తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నరేష్, బాలాపూర్ మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్యతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments