ప్రజాస్వామ్య పరిరక్షణ ,దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే కేంద్ర ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం
రాజ్యాంగ సంస్థలపై అసత్య ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన….
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, మేధావులతో కొండాపూర్లోని సీసీఆర్టీ (CCRT) ఆవరణలో ఎస్ఐఆర్ (SIR), ఎఫ్సీఆర్ఏ (FCRA) నిబంధనలు మరియు దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న తప్పుడు ప్రచారాలను ఆధారాలతో సహా ప్రజలకు నివృత్తి చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక మేధోమథన సదస్సులో పాల్గొన్న…చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “దేశ భద్రత, ఆర్థిక పారదర్శకతే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం. ఎస్ఐఆర్ (SIR) ద్వారా తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు మరియు విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA) అమలు ద్వారా విదేశాల నుంచి వచ్చే ప్రతి పైసా సద్వినియోగం కావాలన్నదే కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పం. కొన్ని ఎన్జీవోల ముసుగులో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా విదేశీ నిధులు మళ్లించినప్పుడు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటే దానిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం దురదృష్టకరం. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కాంగ్రెస్ వైఖరిని విద్యావంతులు, మేధావులు ఎండగట్టాలి. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో కేంద్రం రాజీపడే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి, దేశ సమగ్రత కంటే కేవలం సంకుచిత రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యం. దేశ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా మద్దతు పలుకుతూ, చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల పనితీరుపై అనుమానాలు రేకెత్తించడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, నిబంధనలు దేశ సమగ్రతను, జాతీయ భద్రతను కాపాడటానికే ఉద్దేశించినవి. ఐటీ, సాంకేతిక, విద్యా రంగాలకు నిలయమైన శేరిలింగంపల్లిలోని మేధావులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి” అని పిలుపునిచ్చారు. సదస్సు ముగింపులో నిర్వహించిన ప్రశ్నోత్తరాల వేదికలో ఐటీ నిపుణులు, న్యాయవాదులు, పరిశోధకులు, విశ్రాంత అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ గణాంకాలు, వాస్తవ ఆధారాలతో వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ముఖ్య నాయకులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.