Tuesday, August 11, 2026
Google search engine
Homeతెలంగాణసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో భరోసా : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో భరోసా : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

బి.యన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.కే.డి. నగర్ నందు నివాసం ఉండే ప్రసాద్ ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి, వారి చికిత్సకు అవసరమైన వివరాలను ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా దరఖాస్తు చేయించారు.దానికి గాను రూ.2,60,000 (రెండు లక్షల అరవై వేల రూపాయలు) ఎల్.ఓ.సీ. మంజూరు కాగా ఆ చెక్కును బాధితుడి భార్య ధనలక్ష్మికి అందజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు సేవ చేయడం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది పేద కుటుంబాలకు సహాయం చేసే అవకాశం లభించిందన్నారు.అనంతరం బాధితుడి భార్య మాట్లాడుతూ, మా వారి ఆరోగ్య సమస్య విషయంలో సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సహాయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స కోసం చెక్కు అందించడంలో ఆయన చూపిన మద్దతు జీవితాంతం మరువలేమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భారస నాయకులు చెన్నగోని శ్రీధర్ గౌడ్, పండల రాజశేఖర్,మంద రాజశేఖర్ రెడ్డి,నితీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments