మల్కాజిగిరి సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి
ఎల్బీనగర్
సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్లో సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు, ఆన్లైన్ షాపింగ్, కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, రుణాల పేరుతో మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, టిప్‌లైన్ కేసులు, ఆన్లైన్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఓటీపీ–యూపీఐ మోసాలు, ఫిషింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది స్థానిక సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి, ఏసీపీ శివశంకర్ గౌడ్, నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్ఐలు పి. శివ నాగ ప్రసాద్, మమతారెడ్డి పాల్గొని సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


