Saturday, October 31, 2026
Google search engine
Homeతెలంగాణఅనాథ విద్యార్థి గృహంలో స్వచ్చత కార్యక్రమం

అనాథ విద్యార్థి గృహంలో స్వచ్చత కార్యక్రమం

ఎల్బీనగర్

ఎన్టీఆర్ నగర్ డివిజన్ అనాథ విద్యార్థి గృహంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హాజరైన రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పి.పవన్ కుమార్ రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి జి.శాంతిశ్రీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు స్వయంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గృహం యొక్క అన్ని పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడమే కాకుండా గృహములోని వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్స్, లివింగ్ రూమ్స్ అన్ని తనిఖీ చేసి స్వచ్చత కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ, అనాథ విద్యార్థి గృహ విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటానని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి
శాంతిశ్రీ గృహములోనీ అన్ని విభాగాలను, రికార్డులను కూడా తనిఖీ చేసి,స్వచ్ఛత గురించి విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి జి. ప్రవీణ్ కుమార్, బాలల రక్ష భవన్ కోఆర్డినేటర్ ఈ.రోజా సంరక్షణ అధికారులు వి.ప్రవీణ్ కుమార్జి జి.వెంకటేష్, అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments