Wednesday, September 2, 2026
Google search engine
Homeతెలంగాణఅనాథ విద్యార్థి గృహంలో సత్య శక్తి మహిళా శాఖ రాఖీ ఉత్సవాలు

అనాథ విద్యార్థి గృహంలో సత్య శక్తి మహిళా శాఖ రాఖీ ఉత్సవాలు

ఎల్బీనగర్:

మలక్ పేట్ అగర్వాల్ సమాజ్ వారి సత్య శక్తి మహిళా శాఖ ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో ఆదివారం ఘనంగా రాఖీ ఉత్సవాలను జరిపారు.ఈ సందర్భంగా గృహ విద్యార్థులకు రూ .60 వేల విలువ గల వాషింగ్ మిషన్,కుక్కర్స్, స్టేషనరీ, రేషన్ వస్తువులను విరాళంగా అందజేశారు.ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ అగర్వాల్ సమాజ్ సెంట్రల్ కమిటీ ట్రెజరర్ రాజగోపాల్ మాట్లాడుతూ, అనాథ విద్యార్థి గృహ నిర్వాహకులు అన్ని విషయాలలో అద్భుతమని , ఒక పవిత్రమైన ఆశ్రమమని, విద్యార్థుల క్రమ శిక్షణ, పట్టుదల చాలా గొప్పగా ఉన్నాయని, ఇలాంటి అనాథ గృహములో గత 17 సంవత్సరాల నుండి విద్యార్థులకు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ సందర్భంగా అత్యవసరమైన అన్ని స్టేషనరీ, రేషన్ ఐటమ్స్ విరాళంగా అందజేస్తూ, ప్రతి విద్యార్థికి ఒక అక్కగా, ఒక అమ్మగా రాఖీ కడుతూ, వారిలో ధైర్యం నింపుతూ, అద్భుతమైన పండగ వాతావరణం కల్పిస్తున్న ప్రతి సత్య శక్తి మహిళ ఆర్గనైజర్ కు ధన్యవాదాలు తెలిపారు. నిర్ణయాత్మక విషయాలపై మరియు లక్ష్యసాధనపై వర్క్ షాపును డాక్టర్ రాహుల్ అగర్వాల్ మరియు జితేష్ అగర్వాల్ నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు పసందైన విందు భోజనము ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, కమిటీ సభ్యులు మహాత్మా, శ్రీనివాస్, సత్య శక్తి మహిళా శాఖ అధ్యక్షులు రాణి మిట్టల్, కార్యదర్శి నీతి అగర్వాల్, ఉపాధ్యక్షులు పుష్ప అగర్వాల్, జాయింట్ సెక్రెటరీ కవిత అగర్వాల్,గుల్బర్గా నుండి ధ్యాన నిపుణులు సుశీల్ ఖబల్దార్ హాజరైనారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments