Tuesday, September 1, 2026
Google search engine
Homeతెలంగాణమూసారాంబాగ్ హైలెవల్ వంతెన జాతికి అంకితం: సీ.ఎం రేవంత్ రెడ్డి.

మూసారాంబాగ్ హైలెవల్ వంతెన జాతికి అంకితం: సీ.ఎం రేవంత్ రెడ్డి.

  • రవాణా రంగంలో మరో మైలురాయి
  • ప్రజలకు శాశ్వత ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి
  • మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్:

హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్ హైలెవల్ వంతెనను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ, ఈ నూతన వంతెన అందుబాటులోకి రావడం ద్వారా తూర్పు, మధ్య హైదరాబాద్ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులకు ఈ వంతెనతో శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.

*ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ముగింపు
గతంలో మూసారాంబాగ్ వాతావరణం మరియు వరద ఉధృతి కారణంగా తలెత్తిన రాకపోకల అంతరాయాలు ఇకపై పునరావృతం కావు. ఈ హైలెవల్ వంతెన నిర్మాణం ద్వారా అంబర్‌పేట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల మధ్య నిత్యం వేలాది వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీ సమస్య తొలగిపోనుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు ఇంధనం, సమయం ఆదా అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

*మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాజధాని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మధుయాష్కీ గౌడ్ గారు కొనియాడారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దూర దృష్టి ఫలితంగా నగరంలో ఎక్కడా లేని విధంగా నూతన ఫైవ్‌ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాధనం సద్వినియోగం అవుతూ, నాణ్యతా ప్రమాణాలతో కూడిన అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు వందలాదిగా తరలివచ్చిన స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వంతెన ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో కలిసి నాయకులు వంతెనపై కలియతిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments