Wednesday, August 19, 2026
Google search engine
Homeతెలంగాణఎల్బీనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి

ఎల్బీనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి

ఎల్బీనగర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ కూడలి వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి,ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గొప్ప యోధుడు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.సామాజిక సమానత్వం,ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. అణగారిన వర్గాల కోసం ఆయన చూపిన ధైర్యం, త్యాగం చిరస్మరణీయం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,లింగాల రాహుల్ గౌడ్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments