Saturday, November 21, 2026
Google search engine
Homeతెలంగాణఓమ్ని హాస్పిటల్ ఎక్స్‌ రోడ్స్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

ఓమ్ని హాస్పిటల్ ఎక్స్‌ రోడ్స్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

ఎల్బీనగర్:

రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం ఓమ్ని హాస్పిటల్ ఎక్స్‌ రోడ్స్‌లో ‘అరైవ్ అలైవ్ – రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం’ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. మధుసూధన్, చైతన్యపురి సీఐ కే సైదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు, సాధారణ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రయాణ అలవాట్లను అలవరచుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే సమయంలో జేబు దొంగతనాలు, మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువుల చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. తమ వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments