ఎల్బీనగర్:
హుడా కాలనీ కాంప్లెక్స్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతనిని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందిన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం…ఈ నెల 25 న హుడా కాలనీ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా సరూర్ నగర్ పోలీస్ సిబ్బంది ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ 29 వ తారీఖున చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయని సీఐ శ్రీశైలం తెలిపారు.


