ఎల్బీనగర్:
చైతన్యపురిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో అక్టోబర్ 9న (శుక్రవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్.ఎం. మానస ఒక ప్రకటనలో తెలిపారు.లాసెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు మొత్తం ఒరిజినల్ సర్టిఫికెట్లతో అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ఆమె సూచించారు.పూర్తి వివరాలకు 9603617134 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. మొత్తం 20 సీట్లను మెరిట్ ప్రకారంగా ఎంపిక నిర్వహిస్తామని తెలిపారు.


