Sunday, September 6, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ ప్రగతి పథంలో మరో సువర్ణ అధ్యాయం: నల్గొండ క్రాస్‌రోడ్డు - ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్...

తెలంగాణ ప్రగతి పథంలో మరో సువర్ణ అధ్యాయం: నల్గొండ క్రాస్‌రోడ్డు – ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

  • ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం
  • ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

హైదరాబాద్:

రాజధాని మహానగరంలో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా నల్గొండ క్రాస్‌రోడ్డు నుండి ఒవైసీ జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన ఉన్నత స్థాయి వంతెన (ఫ్లైఓవర్) ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. నగర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ వంతెన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అన్ముల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సుందర కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు మహానగర మాజీ మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు విచ్చేసి, ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పాలనా విధానాలపై తమ అభినందనలను తెలియజేశారు.

*రవాణా ఇబ్బందుల నుండి శాశ్వత విముక్తి
చారిత్రక నల్గొండ క్రాస్‌రోడ్డు నుండి ఒవైసీ జంక్షన్ ప్రాంతం వరకు నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో తీవ్రమైన రద్దీ నెలకొనేది. ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న వాహనాల రద్దీని శాస్త్రీయంగా అంచనా వేసిన ప్రభుత్వం, ట్రాఫిక్ మునుపటి కంటే సులభతరంగా మారేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసింది.
ఈ నూతన వంతెన అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇంధన ఆదా కూడా జరిగి పర్యావరణ పరిరక్షణకు మార్గం సుగమమైంది. నగర ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు ఈ నిర్మాణం ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

*పాల్గొన్న ప్రముఖులు
ఈ ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలు జోడెడ్లుగా సాగుతున్న ప్రజాపాలనలో భాగస్వాములు కావడం గర్వకారణమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments