Friday, September 4, 2026
Google search engine
Homeతెలంగాణ22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి

22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి

ఎల్బీనగర్:

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్‌లో ర్యాలీ నిర్వహించారు. డివిజన్‌ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డివిజన్‌ లోని టెలిఫోన్ కాలనీ, మార్గదర్శి, ఆల్కాపురి, హరిపురి, యాదవనగర్ తదితర కాలనీల్లోని పట్టా భూములను సైతం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అవసరాల కోసం భూములను విక్రయించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయా ప్రాంతాల భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల ప్రజల్లో నిత్యం అభద్రతా భావం నెలకొంటోందని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.అర్హత ఉన్న పట్టా భూములను తక్షణమే 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ప్రజల భూ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, అధికారుల స్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, నాయకులు సాజీద్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, రాంనర్సింహా గౌడ్, గొడుగు శ్రీనివాస్, ఊర్మిళ రెడ్డి, సిద్దగోని వెంకటేష్, శ్యామ్ గుప్తా, కంచెర్ల శేఖర్, ఎండీ జాహెద్, ముచింతల జగన్, బాలుశ్రీ, శ్రీకాంత్ గౌడ్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్, వల్లూరి రమేష్, నిరంజన్, దశరథ్, కపిల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments