బడంగ్ పేట్:
సర్ ప్రక్రియలో భాగంగా జలపల్లి సర్కిల్ పరిధిలోని పహడి షరీఫ్ వార్డ్ ఆఫీసులో నిర్వహించిన హియరింగ్ కు కందుకూరు ఆర్డీఓ/ఈఆర్ఓ ఎన్.జగదీశ్వర్ రెడ్డి హాజరై వచ్చిన ఓటర్లందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.హియర్ రింగ్ జరుగుతున్న తీరును తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
- నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 11 పత్రాలలో ఏదో ఒక పత్రాన్ని హియరింగ్ సందర్భంలో సమర్పించాలని తెలియజేశారు.
- ఏదైనా కారణం చేత హియరింగ్ కు హాజరుకాలేని ఓటర్లు తమ పత్రాలను బీఎల్ఓకు అందజేయవచ్చునని తెలిపారు.ఇప్పటివరకు మహేశ్వరం నియోజకవర్గంలో వారి వారి ఏఈఆర్ఓల పరిధిలో నిర్వహించిన హియరింగ్ కు హాజరు కాలేకపోయిన ఓటర్లకు ఈ నెల సెప్టెంబర్ 5, 6 తేదీలలో మెగా హియరింగ్ ను ఏఈఆర్ఓలు నిర్వహిస్తారని, ఈ మెగా హియరింగ్ కు ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరైతే ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదో, ఆ ఓటర్లందరూ వచ్చి తమ తమ పత్రాలను సబ్మిట్ చేయవచ్చునని తెలపడం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యం బాగా లేనివారు, ఇంకా ఏదైనా కారణం చేత హియరింగ్ కు హాజరుకాలేని ఓటర్లు తమ తమ పత్రాలను డైరెక్ట్ గా బీఎల్ఓలకు అందించవచ్చునని ఈఆర్ఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి. వెంకట్ రామ్,మహేశ్వరం నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ నరేష్, జలపల్లి సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ వినయ్ కుమార్, బీఎల్ఓ సూపర్ వైజర్స్, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.


