Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

  • చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లకు ఓటరు నమోదు దరఖాస్తుల పంపిణీ
  • ద్వారకాపురం కమ్యూనిటీ హాల్‌లో న్యూ దిల్సుఖ్‌నగర్, భవానీనగర్ వాసులతో సమావేశం

ఎల్బీనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి మద్దతుగా చైతన్యపురి డివిజన్‌లోని ద్వారకాపురం కమ్యూనిటీ హాల్‌లో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. న్యూ దిల్సుఖ్‌నగర్, భవానీనగర్, ద్వారకాపురం ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్లను కలిసి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ త్రివేది, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి, కార్మిక శాఖ అధ్యక్షుడు జలంధర్, యూత్ వింగ్ నాయకుడు సాయి ప్రశాంత్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments