Thursday, October 1, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్మెడికవర్ హాస్పిటల్లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే వేడుకలు....

మెడికవర్ హాస్పిటల్లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే వేడుకలు….

హార్ట్ హెల్త్ సివిఆర్పై అవేర్నెన్స్….

గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన అవనరం…మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కృష్ణ-

సమావేశంలో మాట్లాడుతున్న మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కృష్ణ-
భారత శక్తి సెప్టెంబర్ 29: శేరిలింగంపల్లి : గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎవుడు ఎవరికైనా రావచ్చని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కృష్ణ అన్నారు. మంగళవారం మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని పోర్ట్ హెల్త్ అవేర్నెన్, సిసిఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటు లక్షణాలను సకాలంలో గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం, సిపిఆర్పై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతు గుండె ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు అన్నారు. గుండెపోటు ప్రమాద కారకాలు, ముందస్తు హెచ్చరిక లక్షణాలపై అవగాహనతో పాటు సిపిఆర్పై ప్రాథమిక జ్ఞానం ఉంటే అత్యవసర సమయంలో కీలకమైన నిమిషాల్లో సరైన విధంగా స్పందించగలుగుతారన్నారు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుకు సమాజంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు ఎలా సహాయం చేయాలో కూడా తెలుసుకోవాలన్నారు. గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయడం, వైద్య సహాయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు అన్నారు. ఛాతీలో నొప్పి లేదా అసౌకార్యం శ్వాస తీసుకోవడలో ఇబ్బంది. అసాధారణంగా చెమటలు పట్టడం, అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం, చేతి భుజం, వెన్నులేదా దవడ వైపు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారం, రక్తపోటు షుగర్ కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకరలను నియంత్రించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ సంపత్ కుమార్, ఇండియన్ చెస్ట్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి, టిసిఎస్ హైదరాబాద్ రీజినల్ హెడ్ హెచ్ ఆర్ శ్రీకాంత్, ఎంసీఏంలో రిజిస్టర్ అయిన డైరెక్టర్ రణబీర్ సింగ్ బగ్గా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments