Wednesday, September 30, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్24వ పద్మశాలి దసరా మేళా కరపత్రం ఆవిష్కరణ

24వ పద్మశాలి దసరా మేళా కరపత్రం ఆవిష్కరణ

ఎల్బీనగర్:

పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళాకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత్ రావు మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి, ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న గణేష్ పద్మశాలి దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ, ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, పడాల రవీందర్, గోపాల్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఊరుకొండ రమాదేవి, భారతమ్మ, సంతోషిని యువజన సంఘం అధ్యక్షులు కర్నాటి విజయ్, ఉదయ్ వినయ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పద్మశాలి ప్రముఖులు, వివిధ పద్మశాలి సంఘాల నాయకులు మరియు వందలాది మంది పద్మశాలీయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న గణేష్ నేత మాట్లాడుతూ, పద్మశాలి సమాజ ఐక్యతతో పాటు రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో గత 23 సంవత్సరాలుగా ఎల్బీ నగర్‌లో పెద్ద ఎత్తున ‘పద్మశాలి దసరా మేళా’ పేరుతో పద్మశాలీయుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మేళాను ఒక పండుగలా, వివిధ ఆసక్తికర కార్యక్రమాలతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించడం వల్ల జంట నగరాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పద్మశాలీయులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.24వ పద్మశాలి దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ మాట్లాడుతూ, పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకోవడానికే కాకుండా, చేనేత కళాకారులను మరియు సంఘ శ్రేయోభిలాషులను సత్కరించి ప్రోత్సహించేందుకు కూడా పద్మశాలి దసరా మేళా ఒక మంచి వేదికగా నిలుస్తోందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments