కందుకూరు
కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో రీ-సర్వేకు సంబంధించిన సమస్యలు పెండింగ్ అంశాలపై కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్. జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు ఆఫ్ సర్వే, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జిపిఓలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రీ-సర్వేకు సంబంధించి ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, భూ సరిహద్దుల వివాదాలు, రికార్డులలో ఉన్న వ్యత్యాసాలు, పెండింగ్ దరఖాస్తులు మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. రీ-సర్వేకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం నిర్దేశించిన ఎస్ ఓ పి (Standard Operating Procedure) ప్రకారం పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని ఆర్డిఓ అధికారులకు సూచించారు. అలాగే, సంబంధిత రికార్డులు, సర్వే మ్యాపులు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా సమస్యలను పరిష్కరించాలని, వివిధ స్థాయిల అధికారుల మధ్య సమన్వయం పాటించాలని, పెండింగ్ అంశాలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు రీ-సర్వే సేవలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా, సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


