ధాన్యం తరలింపుకు అన్ని ఏర్పాట్లు
తాండూర్ ఆర్. డీ. ఓ. అనిత
వికారాబాద్:
యాలాల…యాలాల్ మండలం లోని వరి కొనుగోలు కేంద్రాల నుంచి త్వరగా ధాన్యం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాండూర్ ఆర్డీవో అనిత తెలిపారు. వివారాల్లోకి వెలితే బుధవారం యాలాల మండల పరిధిలోని దౌలాపూర్ శివారులో గల పత్తి మిల్లులను తహసీల్దార్ గాయత్రి మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే దాన్యానికి నిలువ ఉంచేందుకు ప్రదేశం లేకపోవడంతో అన్లోడింగ్ సమస్య ఏర్పడిందని దీంతో రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూడాల్సి వస్తుందని అన్నారు. పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఆర్. డీ. ఓ. యాలాల తహసీల్దార్ గాయత్రి తో కలిసి ధాన్యం నిలువ చేసిన మిల్లులను పరిశీలించారు. ఆర్. డీ. ఓ. వెంట యాలాల తహసీల్దార్ గాయత్రి, ఎస్సై విఠల్ రెడ్డి అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, సుజాత జిపిఓలు తదితరులు ఉన్నారు.


