Tuesday, September 1, 2026
Google search engine
Homeతెలంగాణవిద్యార్థులకు అండగా సత్య సాగర మాణిక్యాంబ కాపు ఛారిటబుల్ ట్రస్ట్

విద్యార్థులకు అండగా సత్య సాగర మాణిక్యాంబ కాపు ఛారిటబుల్ ట్రస్ట్

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం కాపు భవన్ నందు సత్య సాగర మాణిక్యాంబ కాపు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ట్రస్ట్ చైర్మన్ బొలిశెట్టి నరసింహారావు (తాతాలు) ఆధ్వర్యంలో దాదాపు 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేశారు. వీరిలో 17 మంది కాపు విద్యార్థులు, 5 మంది ఇతర కులాల విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ బొలిశెట్టి నరసింహారావు (తాతాలు) స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమైన గొప్ప శుభపరిణామమని అన్నారు.
అదేవిధంగా వయో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ దాదాపు 75 మందికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున గత 18 నెలలుగా ఆర్థిక సహాయం అందించడం ఎంతో గొప్ప విషయమని సుధీర్ రెడ్డి ప్రశంసించారు.అలాగే కాపు భవన్ అభివృద్ధి పనులకు రూ.12 లక్షలు అందించడం కూడా హర్షణీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖరరెడ్డి, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుబ్బారాయన్,ట్రస్ట్ సభ్యులు రామారావు,తోట వెంకటేశ్వర్లు, తూము నాగభూషణం, నారాయణ మూర్తి, రుద్ర శ్రీనివాస్, సూరిబాబు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments