Friday, September 25, 2026
Google search engine
Homeతెలంగాణ2030 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన,

2030 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన,

  • 2033 కల్లా అగ్రగామి ఆర్థిక వ్యవస్థే లక్ష్యం..
  • సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధికి నూతన ఊపు..
  • టీఎస్‌డీపీఎస్ బలోపేతం, ఏడు రంగాల వారీగా ప్రత్యేక గ్రోత్ ల్యాబ్స్ ఏర్పాటు..

హైదరాబాద్:
దేశానికే ఆదర్శంగా నిలిచే రీతిలో తెలంగాణను ఆర్థిక, సామాజిక రంగాల్లో అగ్రపథాన నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో రాష్ట్రాన్ని సమూలంగా మార్చివేసే దిశగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక కార్యాచరణకు రూపకల్పన చేశారు.

నిర్ణీత కాలపరిమితిలోగా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి తెలంగాణను సంపూర్ణ పేదరిక రహిత రాష్ట్రంగా (జీరో పావర్టీ) తీర్చిదిద్దడంతో పాటు, 2033 నాటికి దేశంలోనే అత్యున్నతంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా నిలపాలనే అత్యున్నత దార్శనికతతో ముందుకు సాగుతున్నారు.
ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, జీఎఫ్‌ఎస్‌టీ ఉపాధ్యక్షులు ఎస్.పీ. టక్కర్ తదితర ప్రతినిధులు పాల్గొని సమగ్ర అభివృద్ధి విధివిధానాలపై చర్చించారు.

*ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘాన్ని (టీఎస్‌డీపీఎస్) మరింత పటిష్టం చేసేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం మరియు సంక్షేమ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

*జిల్లా స్థాయి నుంచి సమూల మార్పులు
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ స్పష్టమైన ఫలితాలను సాధించే దిశగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ఆధారంగా ప్రత్యేక డ్యాష్‌బోర్డులను రూపొందిస్తారు. దీనివల్ల జిల్లాలవారీగా పురోగతిని బేరీజు వేసుకోవడానికి, లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకోవడానికి వీలుంటుంది.

*ఏడు రంగాల్లో ప్రత్యేక గ్రోత్ ల్యాబ్స్
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంజిన్‌లుగా నిలిచే ఏడు ప్రధాన రంగాలపై దృష్టి సారించి ‘సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్’ను ఏర్పాటు చేయనున్నారు.

  • పేదరిక నిర్మూలన
  • మౌలిక వసతులు – లాజిస్టిక్స్
  • వైద్య, ఆరోగ్య రంగం
  • పర్యాటక రంగం
  • పశుసంపద – ఆక్వాకల్చర్
  • పట్టణీకరణ
  • ఆర్థికాభివృద్ధి మరియు పెట్టుబడులు

ఈ ల్యాబ్స్ ద్వారా ఆయా రంగాల్లో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు, ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తారు.

*డేటా ఆధారిత పాలన – నిపుణుల సేవలు
పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు, నిర్ణయాలన్నీ కచ్చితమైన సమాచార ఆధారంగా తీసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న నిపుణులు మరియు కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ సమగ్ర వ్యవస్థల ద్వారా తెలంగాణను దేశానికే రోగ్‌నిలయంగా మలచడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సమావేశం స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments