Monday, June 23, 2025
Google search engine
Homeట్రెండింగ్‌గుడ్లగూబ తల 360 డిగ్రీలు తిరుగుతుంది..

గుడ్లగూబ తల 360 డిగ్రీలు తిరుగుతుంది..

సర్వేలో విస్తుపోయే నిజాలు..

గుడ్లగూబ పేరు వినగానే చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇవి ఇతర పక్షుల్లా రెగ్యులర్‌గా కనిపించవు. వీటి ఆకారం, పెద్ద పెద్ద కళ్లు, విచిత్రమైన అరుపు భయపెడతాయి. దానికి తగ్గట్లు ఈ పక్షులు రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తాయి. ఎరను వేటాడటానికి, రక్షణ కోసం తలను 270 డిగ్రీల్లోనూ తిప్పగలదు. అయితే ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. గుడ్లగూబలు తలలను 360-డిగ్రీల వరకు కూడా తిప్పే అవకాశాలు ఉన్నాయట. ఇంతకీ ఇలా తలను రొటేన్‌ చేయడం వాటికి ఎలా సాధ్యం? వాటిని ఎలాంటి హాని ఉండదా? ఈ అద్భుతమైన ఫీట్‌ వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన అలెగ్జాండ్రా పన్యుటినా నేతృత్వంలోని పరిశోధనా బృందం, స్వతంత్ర పరిశోధకుడు అలెగ్జాండర్ కుజ్నెత్సోవ్ ఎనిమిది గుడ్లగూబ జాతుల శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. సీటీ స్కాన్‌లను ఉపయోగించి, గుడ్లగూబలు తలను రొటేట్‌ చేయడానికి ఉపయోగపడే రెండు ప్రధాన పద్ధతులను కనుగొన్నారు:

ఫ్లెక్సిబుల్ నెక్ జాయింట్స్: గుడ్లగూబలకు 14 మెడ వెన్నుపూసలు ఉంటాయి. మనుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ. ఈ వెన్నుపూసలు వాటి మెడలు ఒకే జాయింట్‌లో 126 డిగ్రీల వరకు వంగి, తిప్పడానికి అనుమతిస్తాయి. ఫ్లెక్సిబుల్ నెక్ కీళ్లతో పాటు, గుడ్లగూబలు తమ వెన్నుముకలను ప్రత్యేకమైన రీతిలో ఉపయోగిస్తాయి. వారి వెన్నెముక స్పైరల్ మెట్ల వలె మెలితిప్పినట్లు తిరుగుతుంది. ఈ ‘కాయిలింగ్’ మోషన్ అదనంగా ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది. ఎముకలు, కండరాలు లేదా స్నాయువులకు హాని కలిగించకుండా పూర్తి 360-డిగ్రీల తిప్పే వీలు కల్పిస్తుంది. గుడ్లగూబల ప్రత్యేక శరీర నిర్మాణ శాస్త్రం పూర్తిగా తలను తిప్పినా గాయాలు కాకుండా రక్షిస్తుంది. ఎలాగంటే.. వెన్నెముక కాయిలింగ్ వాటి కండరాలు, ఎముకలపై ఒత్తిడిని నిరోధిస్తుంది. పన్యుటినా ప్రకారం, గుడ్లగూబ మెడ వెంట నడిచే వాగస్ నాడి, భ్రమణ సమయంలో సాగదు లేదా దెబ్బతినదు. ఇది కండరాలకు పైన ఉంటుంది. గుడ్లగూబ దాని తలను మెలితిప్పినట్లు చిన్న మార్గాన్ని కనుగొంటుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ గుడ్లగూబలు నరాల దెబ్బతినకుండా లేదా ఎగిరే సామర్థ్యాన్ని ప్రభావితం చేయకుండా తలలను తిప్పడానికి అనుమతిస్తుంది. పన్యుటినా అధ్యయనం, ఈ పక్షులు తలలను 360-డిగ్రీలు తిప్పగలవనే ఆలోచనకు సపోర్ట్‌ చేస్తోంది. దీనికి నిపుణులందరూ దీన్ని అంగీకరించరు. లాస్ ఏంజిల్స్ కౌంటీకి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు మైఖేల్ హబీబ్‌కు దీనిపై సందేహాలు ఉన్నాయి. ఎముకలు, కండరాలు తీవ్రమైన కదలికలను నిర్వహించగలవు, మెడలోని నరాలు ప్రమాదంలో పడవచ్చని ఆయన వాదించారు. ఈ నరాలను అతిగా సాగదీయడం వల్ల తాత్కాలిక పక్షవాతం ఏర్పడవచ్చని, ఇది గుడ్లగూబ ఎగిరే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. అయితే పన్యుటినా ఈ వాదనను అంగీకరించలేదు. నరాలకు రక్షణ ఉంటుందని, ఎముకలు, కండరాల మాదిరిగానే ఒత్తిడిని ఎదుర్కోవు..

ఈ చర్చలకు తెరదించడానికి శాస్త్రవేత్తలు ప్రత్యక్ష గుడ్లగూబలపై ప్రయోగాలు చేయాలి. రొటేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై నిల్చుని ఒకే లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడానికి గుడ్లగూబలకు శిక్షణ ఇవ్వడం ఒక ప్రతిపాదిత పద్ధతి. ఇలా ఎటువంటి హాని లేకుండా తమ తలలను 360 డిగ్రీలు విజయవంతంగా తిప్పగలవో లేదో పరిశోధకులు గమనిస్తున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments