Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణకోటి తొంబై తొమ్మిది లక్షల రూపాయలతో ఉమెన్స్ థీమ్ పార్క్ అభివృద్ధి..

కోటి తొంబై తొమ్మిది లక్షల రూపాయలతో ఉమెన్స్ థీమ్ పార్క్ అభివృద్ధి..

పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి..

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్, ఎన్.జీ.ఓస్ కాలనీలో కోటి 99 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఉమెన్స్ థీమ్ పార్క్ పనులను బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. అశోక్ రెడ్డి, ఈ ఈ రమేష్ బాబు, డీ.ఈ. దామోదర్ రావు, జలమండలి డీజీఎం రాజగోపాల్ లతో కలిసి పర్యవేక్షించడం జరిగింది.. అనంతరం కాలనీలోని పలు సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కార్పొరేటర్ ని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో ఒకటొకటిగా ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, ఇంజనీరింగ్ విభాగం ఏఈ రాజ్ కుమార్, జలమండలి మేనేజర్ భవ్యారెడ్డి, కాలనీ సభ్యులు పంపన వెంకటేశ్వర్లు, ప్రవీణ్, వర్ధిని, వాణి, తరుణం, శర్మ, డివిజన్ పార్టీ నాయకులు శరత్ కుమార్, జైపాల్ రెడ్డి, పవన్ రెడ్డి, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments