1533 గజాల విస్తీర్ణంలో పార్కును అందుబాటులోకి తెచ్చిన హైడ్రా..
పార్కు అందుబాటులోకి రావడంతో సాయి సారధినగర్ నివాసితుల ఆనందం..
60 ఏళ్ల పోరాట ఫలితమంటూ స్థానికుల సంతోషం..



మధురా నగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్కు ఆక్రమణలను ఆదివారం నాడు హైడ్రా అధికారులు తొలగించారు.. 1961 వ సంవత్సరం నుంచి ఉన్న ఆక్రమణలను తొలగించి.. పార్కు అభివృద్ధికి అవకాశం కల్పించింది హైడ్రా.
సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టారు హైడ్రా అధికారులు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేశారు.. 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించినట్టు నిర్ధారణ అయ్యింది.. పార్కు స్థలంలో షెడ్డు వేసి ఖాళీ చేయకుండా ఆక్రమణలో వున్న లేఔట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొని యింటి నంబర్ కూడా తెచ్చుకున్నట్టు వెల్లడి. ఈ లేఔట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి పార్కును మాత్రం ఖాళీ చేయించ లేదని పలుమార్లు జీ.హెచ్.ఎం.సి. కి ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో హైడ్రాను ఆశ్రయించిన సాయి సారధి నగర్ నివాసితులు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలసి పూర్తి స్థాయి విచారణ చేసిన హైడ్రా. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించింది హైడ్రా. పార్కు స్థలంగా గుర్తించి ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డు పెట్టారు అధికారులు. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం అయ్యిందంటూ స్థానికుల హర్షం వ్యక్తం చేశారు..
60 ఏళ్ల పోరాట ఫలితమంటూ హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు.


