దేవుడు వరమిచ్చాడు పూజారులు పట్టించుకోవడం లేదు
కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్..
అక్రమ నిర్మాణం తొలగించకుండా చోద్యం చూస్తున్న దుర్మార్గం..
బాధితుల గోడు పట్టించుకోక పోవడం అన్యాయం అంటున్న స్థానికులు..
డబ్బు, పలుకుబడి వున్నవారికి ఊడిగం చేస్తున్న వైనం..
ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి న్యాయం జరిగేలా చూడాలి..
గణేష్ మండపాల కోసం కుటుంబం నిర్బంధం అనే వార్త వ్రాశాము.. దీనిపై అధికారులు స్పందించలేదు.. సాక్షాత్తు ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ సైతం ప్రలోభాలకు లోబడి బాధితులకు న్యాయం చేయలేకపోయారు.. దీనితో బాధితులు కోర్టుకు వెళ్లారు.. తమ ఇంటిముందు గణేష్ మండప నిర్మాణం కోసం అక్రమంగా చేపట్టిన నిర్మాణం చేపట్టడంతో తమకు ఎంతో ఇబ్బంది కలుగుతోందని, రాకపోకలకు అంతరాయం కలుగుతోందని తమకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లడం జరిగింది.. కోర్టు పరిశీలించి ఆ అక్రమ మంటప నిర్మాణాన్ని తొలగించమని అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.. కానీ ఇప్పటి వరకు ఆ మండప నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోబడలేదు.. ఇదేమిటని ప్రశ్నించే అవకాశం కూడా లేకపోయింది..
జరిగిన విషయం ఒకసారి చూస్తే జోగు స్వామి తండ్రి రాములు, చింతపల్లి గూడ గ్రామం ఇంటినెంబర్ 2-94, ఆది భట్లమున్సిపాలిటీ నివాసి ఈయనకు ఆయన నాన్న,తాత, ముత్తా తలు నివసించినటువంటి సొంత ఇల్లు వుంది. ఆఇంటి ముందు అతని తండ్రి దాదాపు 20 ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు ఉన్నాయి అందులో పెద్ద పెద్ద వేప చెట్లు, మామిడి చెట్లు, వగైరా కూడా ఉన్నాయి. ఇలాంటి మహా వృక్షాలను కొంత మంది రౌడీ మూక లు దౌర్జన్యంగా వచ్చి వాటిని టార్గెట్గా చేసుకుని మునిసిపల్ ఆఫీస్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మున్సిపాలి టీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొట్టివేయడం జరిగింది. 03-08-2025 రోజు తన ఇంటి ముందు అక్రమ కట్టడాలు కట్టడం కోసమని ఆయన కుటుంబ సభ్యులను ఇంట్లోకి పోనివ్వకుండా, బయటకు రానీయకుండా పూర్తిగా రాకపోకలు బంద్ చేస్తూ ఆ కుటుంబానికి జీవించే హక్కును హరిస్తూ.. ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ.. వారి ఇంటి పైకి దాడికి వస్తూ.. వారు ఇంట్లోకి పోయే దారిని మూసి వేసి.. ఆటంకం కలిగించారు.. ఈ విషయం గమనించి తనకు న్యాయం చేయాలని, తమ జీవితాలకు స్వేచ్ఛ కలిగించాలని కోరుతూ ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఆ వినతి పత్రంలో జరుగుతున్న దౌర్జన్య కాండను విశదీకరించడం జరిగింది.. కానీ మున్సిపల్ కమిషనర్ చీమకుట్టినట్లైనా స్పందించకపోవడంతో.. అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకొని తన ఇంటి ముందు ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోగలరని ఆయన హై కోర్టును ఆశ్రయించడం జరిగింది.. దీనిపై పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..
కానీ ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ గానీ, ఇతర అధికారులు గానీ ఈ ఆదేశాలను ఖాతరు చెయ్యకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారని బాధితుడు వాపోయాడు.. కనుక తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించాలని ఆయన కోరుతున్నాడు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కల్పించుకుని కోర్టు తీర్పుకు అనుగుణంగా తమ ఇంటిముందు వెలసిన అక్రమ మండప నిర్మాణాన్ని తొలగించే విధంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ కు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తమ స్వేచ్ఛకు భంగం కలుగకుండా.. తమకు న్యాయం జరిగేలా చూడాలని పత్రికా ముఖంగా వేడుకుంటున్నాడు..


