పంపిణీ చేసిన గడ్డిఅన్నారం ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి..
ఇది ఎంతో గర్వించదగిన విషయం అంటూ వెల్లడి..
ఎల్.బీ. నగర్ లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఏఎంసీ డైరెక్టర్ పంటల జైపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల పంపిణీని, 12 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రారంభించడం గర్వించదగ్గ విషయం. ఈ నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సంకల్పానికి తమ మద్దతు తెలుపుతున్నారు” అని పేర్కొన్నారు.
అలాగే, సెప్టెంబర్ నెల నుండి కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు సంబంధిత రేషన్ దుకాణాల ద్వారా అవసరమైన సరుకులు పొందగలరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హుడైన కుటుంబానికి రేషన్ కార్డు అందజేయడానికి కట్టుబడి ఉందని ఆయన వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు.


