Monday, February 23, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడిగా కప్పాటి పాండురంగా రెడ్డి..

రంగారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడిగా కప్పాటి పాండురంగా రెడ్డి..

జాగృతి లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించడం..
కవిత ఆదేశాల మేరకు పని చేస్తానన్న పాండురంగారెడ్డి..

దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర జాగృతి అధినేత్రి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి పాండురంగా రెడ్డిని నియమించారు.. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జాగృతి యొక్క లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించడం.. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడం. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించి, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే వ్యవస్థను నిర్మించడం జాగ్రత్తి యొక్క లక్ష్యమని, తెలంగాణ సాధన కోసం అందరం ఐక్యంగా పోరాడి విజయం సాధించామని, ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం పని చేయాలని ఈ సందర్భంగా ఉద్యమకారుడు పాండురంగా రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

అనంతరం పాండురంగా రెడ్డి మాట్లాడుతూ ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ కొసం అధినేత్రి కవితమ్మ అదేశించిన విదంగా రాష్ట్రంలో పేదల వైపు వుండి పోరాటం చేస్తూ.. సామాజిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా అధినేత్రి అదేశం మేరకు క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments