Monday, July 27, 2026
Google search engine
Homeతెలంగాణఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి

ఎల్బీనగర్:

కందుకూరు రెవెన్యూ డివిజన్ సరూర్ నగర్ మండలం పరిధిలోని వెంకటేశ్వర కాలనీలలో కాలనీ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆర్డీఓ/ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్న తీరును, ఎన్యూమరేషన్ ఫారాలను,ఆయన తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. అనర్హుల వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించాలని తెలిపారు. స్థానిక ఓటర్ల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను, నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో సరూర్ నగర్ మండల తహశీల్దార్ పి.వేణుగోపాల్, సూపర్ వైజర్స్ ఆర్ఐ జ్యోతి, జీపీఓ ప్రవర్ధన్ రెడ్డి, స్థానిక బీఎల్‌వోలు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు గండు ధనం రెడ్డి, ఉపాధ్యక్షుడు మునగాల నరేష్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి వెంకట్, జాయింట్ సెక్రటరీ సప్పిడి గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి శ్రీనివాస్ రావు, కాలనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments