Monday, August 24, 2026
Google search engine
Homeతెలంగాణగచ్చిబౌలి ఆంజనేయనగర్లో హైడ్రా - CMC సంయుక్త ఆపరేషన్

గచ్చిబౌలి ఆంజనేయనగర్లో హైడ్రా – CMC సంయుక్త ఆపరేషన్

  • కూలే ప్రమాదం ఉన్న భవనం తొలగింపు
  • పక్కనే ఉన్న భవనాలకు ముప్పు లేకుండా చర్యలు
  • బాహుబలి JCB తో జాగ్రత్తగా తొలగింపు పనులు
  • CMC అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు

హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి లోని ఆంజనేయనగర్లో CMC – హైడ్రా ఆపరేషన్ ప్రారంభించింది. శనివారం 7 అంతస్థుల భవనం కూలిపోయిన విషయం విదితమే. ఆ భవనం కూలినప్పుడు పక్కన ఉన్న మరో 7 అంతస్థుల భవనం కూడా బాగా దెబ్బ తింది. ఆ భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో దాన్ని హైడ్రా – CMC సంయుక్తంగా తొలగిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్టు CMC అధికారులు తెలిపారు. ఈ భవనం కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని CMC అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భవనాన్ని తొలగించాలని హైడ్రాను CMC కోరింది. దీంతో హైడ్రా ఆదివారం చర్యలు ప్రారంభించింది. పక్కనే ఉన్న భవనాలపై పడకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఏమాత్రం భావనల మధ్య గ్యాప్ లేకపోవడంతో జాగ్రత్తగా భవనం తొలగింపు పనులను చేపడుతోంది. భవనం తొలగింపు వైపు ప్రజలు రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. శనివారం సాజిద్ కు చెందిన భవనం కూలడంతో జయదర్శిని అపార్ట్మెంట్ C బ్లాక్ దెబ్బతింది. ఆదివారం తొలగిస్తున్న భవనం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ నివాసితులను ఖాళీ చేయించారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వరుసగా పేక మేడలులా 50 గజల్లో 7 అంతస్తులవరకు నిర్మించిన భవనాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో హైడ్రా – CMC సంయుక్తంగా yee ఆపరేషన్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక భవనాన్ని తొలగిస్తాంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments