Wednesday, September 30, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్ఓయో గదితో యువతి అనుమానన్పద మృతి కేసులో ప్రియుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు.....

ఓయో గదితో యువతి అనుమానన్పద మృతి కేసులో ప్రియుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు…..

మాదావూర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు.

శేరిలింగంపల్లి : ఓయో రూమ్లో అనుమానస్పదంగా యువతి మృతి చెందిన సంఘటనలో యువతి బాయ్ ప్రెండ్ను అరెస్ట్ చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన సిద్దిక్కగర్లోని ఓయో గదికి ప్రియురాలితో కరిసి రవితేజ అనే యువకుడు వెల్లడం జరిగింది. షారోన్ నిఖీకా టోప్నో (29)తో కలిసి శ్రీనివాస రవితేజ ఇద్దరు కలిసి గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని కోరిందనే కారణంతో ఓయో గదితో దాడి చేసినట్లు తెలిపారు. మద్యం మత్తులో వెళ్లి విషయమై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రవితేజ ఆమె తల, మెడపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాల్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. శ్రీనివాస రవితేజ షారోని నిఖితా మృతి చెందిన వెంటనే వైజాగ్కు పారిపోయి అతని ఇంట్లోని లైజాల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. అతని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత రవితేజను అదువులోకి తీసుకున్నామన్నారు. కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వాలెంట్ పై హైదరాబాద్కు తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments