Sunday, October 4, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్జాతిపిత జీవితం అనుసరణీయం

జాతిపిత జీవితం అనుసరణీయం

  • అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
  • అమీన్‌పూర్ లో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

అమీన్పూర్

జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి అనుసరి నియమని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని అమీన్పూర్ చౌరస్తా లోగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు అనుసరించిన విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మహాత్మా గాంధీ, జీవితాలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ కృష్ణ ,కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరి చంద్రకళ గోపాల్ ,భిజిలి రాజు,కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, సీనియర్ నాయకులు,కొల్లూరి యాదగిరి,దాస్ యాదవ్,చౌటకూరి మహిపాల్ రెడ్డి,కొండకల్ శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments