Wednesday, October 14, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్నాదబ్రహ్మోత్సవం–26లో మూడో రోజు "దివ్య" నృత్య వైభవం

నాదబ్రహ్మోత్సవం–26లో మూడో రోజు “దివ్య” నృత్య వైభవం

శేరిలింగంపల్లి

అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం–26 మూడో రోజు కార్యక్రమాలు భక్తి, నృత్య వైభవంతో అలరించాయి.
దివ్య తేజస్విని, ఆమె బృందం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కళాజ్ఞానం ప్రవచనకర్త, మాణిక్యేశ్వరి మాత శిష్యులు పూజ్యశ్రీ శ్రీరామ యోగి , ఇన్సూరెన్స్ ఇన్ఫో బ్యూరో ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకట్ చెంగవల్లి విశిష్ట అతిథులుగా విచ్చేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం ప్రత్యేకగా కూచిపూడి నృత్య ప్రదర్శన దివ్య తేజస్విని బృందం ప్రదర్శించిన నృత్యరూపకాల్లో శ్రీనివాసుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పద్మావతి, నారదుడు, భృగు మహర్షి, ఆకాశరాజు, ధరణీదేవి, వకుళమాత, బ్రహ్మ, గరుడుడు, ఎరుకలసాని తదితర పాత్రలను కళాకారులు భావాభినయంతో ఆవిష్కరించారు. గురువు దివ్య తేజస్విని మార్గదర్శకత్వంలో శిష్యులు మధురి, వైష్ణవి, భారతి, హరి సుప్రియ, హారిక, ప్రియ, సాయి నిఖిత, సృజన తదితరులు వివిధ పాత్రల్లో మెప్పించారు.
సఖుల పాత్రల్లో వేద, అదితి, అక్షిత, అర్జిత, అభినయ శ్రావణి, నిఖిత, స్వాతి లయ, అంచల్ సింగ్, హితశ్రీ, గ్రీషశ్రీ, నిత్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు పద్మశ్రీ డా. శోభారాజు అన్నమాచార్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.అన్నమయ్య సాహిత్యంలోని భక్తి, తాత్వికత, ఆధ్యాత్మిక సందేశాన్ని సంగీతం ద్వారా తరతరాలకు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు.
కళాకారులకు వేదికలు కల్పిస్తూ, యువతలో భక్తి సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ, అన్నమాచార్యుల అమూల్యమైన సంకీర్తన సంపదను విశేషంగా ప్రచారం చేస్తున్న శోభారాజు గారి సంకల్పం ప్రశంసనీయమని కొనియాడారు.

అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని నృత్యరూపంలో ప్రజలకు చేరువ చేసిన దివ్య తేజస్విని బృందాన్ని అతిథులు అభినందించారు. సంగీతం, నృత్యం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక విలువలను విస్తరింపజేయడం అభినందనీయమని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments