Friday, October 30, 2026
Google search engine
Homeతెలంగాణపట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవాలి....

పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవాలి….

గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కో్మిరి శెట్టి సాయిబాబా…
శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని, గతంలో ఓటు వేసిన పట్టభద్రులు సైతం తిరిగి తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు తన ఇంటి నుంచే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, తమ కుటుంబ సభ్యులతో పాటు కాలనీలు, డివిజన్లలోని పట్టభద్రులను గుర్తించి నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 6 చివరి తేదీ కావడంతో సమయం వృథా చేయకుండా ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను, యువతకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా, మంచి మెజారిటీ సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అంజమ్మ , దార్గుపల్లి నరేష్ , షామ్లెట్ శ్రీనివాస్, నరేష్ సింగ్ ,అనిల్ సింగ్ ,దార్గుపల్లి పరమేష్,కృష్ణ రావు,తాహెర్ ,బురాన్ , ఖాదర్ ఖాన్ , బాలమణి ,మాధవి ,అజయ్ గౌడ్,అజీమ్ ,లాయిక్,మక్ బుల్,బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments