Friday, October 30, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్చిరు వ్యాపారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

చిరు వ్యాపారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ ఆర్చ్ నుంచి టీకేఆర్ కాలేజీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణ ప్రణాళికలో భాగంగా రహదారి పక్కన వ్యాపారాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారులకు చెందిన డబ్బాలను తొలగించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం ఉదయం 6 గంటలకు సంఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించి బాధిత చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత చిరు వ్యాపారులు తమ ఆవేదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.రహదారికి అడ్డంగా ఉందని చెబుతున్న టీకేఆర్ ఆర్చ్‌ను తొలగించకుండా, నందనవనం ప్రాంతంలో తమ జీవనోపాధి కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న పేద చిరు వ్యాపారుల డబ్బాలను మాత్రమే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, రాజకీయ అండదండలు ఉన్నవారికి మరో న్యాయమా? అని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో ఫోన్‌లో మాట్లాడి, చిరు వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులపాటు కూల్చివేతలను నిలిపివేయాలని కోరారు. పేద చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా తగిన ప్రణాళిక సిద్ధం చేసిన అనంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి సంఘీభావం తెలిపారు.అభివృద్ధి పనులు జరగడం ఎంత ముఖ్యమో, వాటిపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల జీవనోపాధిని కాపాడటం కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి కార్యక్రమాల వల్ల చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తూ అందరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ భారాస అధ్యక్షులు సత్యంచారి,మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, నాయకులు శ్రీనివాస్ నాయక్,కాప్ర నాయక్, గోపి మధు, నాగిరెడ్డి, బిక్షపతి, సాయి యాదవ్, మహేందర్,కృష్ణ, నరేష్, రెడ్డిమాల కృష్ణ,విష్ణు గౌడ్, అనిత,కింగ్ మధు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments