ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణేష్ మోటార్స్ – మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ నూతన షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ జయేష్ ఠక్కర్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు మరియు భవిష్యత్తులో కాలుష్య రహిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇటువంటి సంస్థలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి డి. శ్రీనివాస్ రంగేశ్వరి ఆహ్వానించగా, వీఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించారు.


