Home Uncategorized జీ హెచ్ ఎం సీ ప్రజావాణిలో అపశ్రుతి…

జీ హెచ్ ఎం సీ ప్రజావాణిలో అపశ్రుతి…

0
  • కలకలం రేపిన ఓ వ్యక్తి..
  • పెట్రోల్ పోసుకుని నిరసన..
  • అడ్డుకున్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు..

ఈరోజు జీ హెచ్ ఎం సి లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అలజడి చెలరేగింది.. ఒక అపశ్రుతి చోటుచేసుకుంది.. నగరంలోని రామ్ నగర్ కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక అధికారి నిర్వాకానికి కలత చెంది తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం దీనితో అక్కడ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.. అయితే అక్కడే ఉన్న పోలీసులులు,విజిలెన్స్ అధికారులు సకాలంలో స్పందించి అతడిని అడ్డుకున్నారు.. దీనితో పెను ప్రమాదం తప్పింది.. అధికారులు స్పందిస్తేనే తాను అక్కడ నుండి వెళ్లిపోతానని సదరు అనిల్ కుమార్ భీష్మించుకు కూర్చున్నాడు.. అసలు విషయం ఏమిటంటే ముషీరాబాద్ ఏసీపీ దేవేందర్ లంచం తీసుకుని తనకు పనిచేస్తున్నాడని అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.. తక్షణమే ఏసీపీని డీసీని కూడా సస్పెండ్ చేయాలని అతను డిమాండ్ చేశాడు.. దానికి అక్కడి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here