Thursday, July 10, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్ధనత్రయోదశి రోజున మీరు ఏమి చేయాలో? ఏమి చేయకూడదో మీకు తెలుసా …

ధనత్రయోదశి రోజున మీరు ఏమి చేయాలో? ఏమి చేయకూడదో మీకు తెలుసా …

ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు గణేషుడిని కూడా పూజిస్తారు . ఇలా చేయడం వలన లక్ష్మీగణపతిల అనుగ్రహం కుటుంబ సభ్యులపై ఉంటుంది. అయితే ధన త్రయోదశి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అలాగే ధన్వంతరికి కూడా కోపం రావచ్చు. అటువంటి సమయంలో ధన త్రయోదశి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో మనం తెలుసుకుందాం.

వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఎవరైతే ధన్వంతరిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వుంటారో వారి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతారు.

ధన త్రయోదశి రోజున ఏమి చేయాలి?

  1. ధన త్రయోదశి రోజున ధన్వంతరిని శుభ సమయంలో పూజించండి.
  2. అలాగే బంగారం, వెండి లేదా మట్టితో చేసిన లక్ష్మీ దేవి, గణేశుడి విగ్రహాలను తీసుకురండి.
  3. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
  4. పేద ప్రజలకు దానం చేయండి.
  5. అన్నాచెల్లెళ్ల పండగ రోజు సాయంత్రం వరకూ రోజూ సాయంత్రం దీపాలు వెలిగించండి.
  6. చీపురు, ధనియాలు, ఇత్తడి పాత్రలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.
  7. ఇంటిని శుభ్రం చేసి ఇంటిని దీపాలతో అలంకరించండి.

ధన త్రయోదశి రోజున ఏమి చేయకూడదు?

  1. ధన త్రయోదశి రోజున ఇంటిని మురికిగా ఉంచవద్దు. శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
  2. చెడు ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు.
  3. ఎవరితోనూ తప్పుగా మాట్లాడకండి.
  4. పెద్దలను, మహిళలను అవమానించకండి.
  5. అశుభకరమైన వస్తువులు కొనకూడదు. ముఖ్యంగా గాజు పాత్రలు కొనకూడదు.
  6. మాంసాహారం, మద్యం, తామసిక ఆహారాన్ని తినకూడదు.

ధన త్రయోదశి రోజున ఏమి కొనుగోలు చేయాలి?

ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి, లక్ష్మీగణేశుడి విగ్రహాలు, పాత్రలు, చీపుర్లు, ధనియాలు మొదలైన వాటిని కొనుగోలు చేయాలి. ఈ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా ధన్వంతరి , లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments