ఎల్బీనగర్
జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల సందర్భంగా కళారత్న మూవీస్ & రాజు ఎంటర్ టైనర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రఖ్యాత ప్రసాద్ సినీ ల్యాబ్స్ లో వందే భారత్ ( సేవ్ ఇండియా) సినిమా ప్రివ్యూ షో ప్రదర్శించారు.ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులకు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కు ఇండియన్ గ్లోరీ అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా కళారత్న మూవీస్ అధినేత, వందే భారత్ సినిమా నిర్మాత, దర్శకులు మల్లం రమేష్ మాట్లాడుతూ, గత 34 సంవత్సరాల నుండి మార్గం రాజేష్ అనాథ విద్యార్థులకు భోజన,వసతి, కార్పొరేట్ విద్యా సౌకర్యాలు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నందుకు ఇండియన్ గ్లోరీ అవార్డుకు ఎన్నిక చేసామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శతాధిక సినిమాల డైరెక్టర్ రేలంగి నరసింహ రావు,సినీ దర్శకుల సంఘాధ్యక్షులు విఎన్ ఆదిత్య, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ మెజీషియన్ రామడుగు వసంత్, ఇంకా సీనియర్ నటులు జనార్ధన్ రావు ( జెన్నీ) కిషోర్ దాసు పాల్గొన్నారు.


