Monday, November 2, 2026
Google search engine
Homeతెలంగాణఅయ్యప్పలకు అన్న సమారాధన​

అయ్యప్పలకు అన్న సమారాధన​

కూకట్పల్లి

కెపిహెచ్‌బి కాలనీ రోడ్ నెంబర్ 02 లో ఆదివారం అత్యంత వైభవంగా అయ్యప్ప స్వాముల అన్న సమారాధన కార్యక్రమనికి జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, సినీ నటులు శ్రీకాంత్, ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ​ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ నెల తే. 01 నుండి జనవరి 01 వరకు నిరంతరాయంగా కొనసాగనుంది.​మొదటిరోజు సందర్భంగా శముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ సౌజన్యంతో ఈ అన్న సమారాధన అందించడమే కాకుండా, స్వయంగా పాల్గొన్నారు. అనంతరం ప్రేమకుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల సేవలో పాల్గొనడం ఎంతో పవిత్రమైన బాధ్యత అని, స్వాముల ఆశీస్సులు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, పాదం సూర్య, బండారి రమేష్, సుభాష్ స్థానిక నాయకులు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments