ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడ డివిజన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు తిలక్ రావు, రాకేష్ ఠాగూర్, గంగపుత్ర భాస్కర్, నర్సింహా గుప్తా, జగన్నాద్ రెడ్డి,తోట రాజశేఖరరెడ్డి, దయానంద్, పార్షపు శ్రీధర్, శ్రీకాంత్, కుమార్, చిత్రం సాయి, ఆనంద్, ప్రసాద్,ప్రకాష్, వెంకట్ రెడ్డి, ఉమ మహేశ్వర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


