మల్కాజిగిరి:
కనిపించకుండా పోయిన బంగారం ఉన్న బ్యాగ్ దొరికింది. ట్రైన్ దిగే సమయంలో మరచిపోయిన బంగారం ఉన్న బ్యాగును నిజాయితీగా తిరిగిచ్చిన వ్యక్తిని పోలీసులు అభినందించారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలిస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ పోలిస్టేషన్ పరిధిలో నివసించే సంగం సూరిబాబు అనే వ్యక్తి వైజాగ్ నుండి ట్రైన్ లో వస్తున్నాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మల్కాజిగిరి రైల్వేస్టేషన్ లో ట్రైన్ దిగాడు. తొందరలో బంగారం ఉన్న బ్యాగును స్టేషన్ లో మరచిపోయాడు. కొంతసేపటికి గుర్తురావడంతొ స్టేషన్ లో వెతికాడు. ఎంతకీ దొరకకపోవడంతో డయల్ 100 కి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి క్రైం పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. జాన్ ఆటో డ్రైవర్ బంగారం ఉన్న బ్యాగును సేఫ్టీగా ఉంచి, బాధితులు వస్తే ఇద్దామని, లేకపోతే పోలీసులకు అప్పజేబుదామనుకున్నాడు. అప్పటికే పోలీసులు రావడంతో నిజాయితీగా 16 తులాల బంగారం ఉన్న బ్యాగును అప్పగించాడు. దానితో మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ జాన్ ను అభినందించారు..


